movies

ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ ఫైర్.. అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు!

11/11/2026

ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ ఫైర్.. అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు!

సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా టీమ్ తనను అవమానించిందంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు మోహన్.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మొదట తనను సంప్రదించారని తెలిపారు. అంతేకాకుండా లుక్ టెస్ట్ నిర్వహించి, గెటప్ కూడా ఫైనల్ చేశారని చెప్పారు. తన లుక్ బాగుందని ప్రశంసించడంతో షూటింగ్ కోసం పిలుస్తారని ఎదురుచూశానని, కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని వెల్లడించారు. తీరా చూస్తే సినిమా షూటింగ్ పూర్తయి, విడుదల కూడా అయిపోయిందని అన్నారు.

ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌లోని ఓ ఆసక్తికర విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చెవిలో పువ్వు’ సినిమాలో తాను నటించలేదని, ఆ సినిమా పరాజయం పాలైందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘ప్రేమ ఖైదీ’లో తాను నటించడంతో ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందని పేర్కొన్నారు.

తనను సంప్రదించి, లుక్ టెస్ట్ చేసిన తర్వాత కనీసం సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదని బాబు మోహన్ మండిపడ్డారు. తనను అవమానించినందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందన్న అర్థం వచ్చేలా ‘దరిద్రం, శని వెంటపడ్డాయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email