మెట్టుగూడలో అయ్యప్ప ఏకదిన పూజ.. శబరిమలను తలపించిన శరణుఘోష!
20/11/2026

మెట్టుగూడ, నవంబరు 20 (మీనారద ప్రతినిధి) — కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెట్టుగూడ అయ్యప్ప దేవస్థానంలో భక్తుల శరణుఘోషల నడుమ ఏకదిన పూజ జరిగింది. సినీ నిర్మాత, వ్యాపారవేత్త నందకుమార్ అబ్బినేని, దేవస్థానం ప్రధాన కార్యదర్శి ఆర్. సునీల్ కుమార్, సంయుక్త కార్యదర్శి కె. సదాశివన్ కలిసి అయ్యప్ప స్వామికి పూజ నిర్వహించారు.
ఏకదిన పూజ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. దీపాల వెలుగులో భక్తులు ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ స్వామివారిని భక్తితో స్మరించుకున్నారు. ఆలయమంతా శరణుఘోషతో మార్మోగిన వేళ అక్కడి వాతావరణం శబరిమల సన్నిధానాన్ని తలపించింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
