పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్!
13/11/2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో అభిమానులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే జనసేన పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఆయన.. సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే వార్త టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. వివరాల్లోకెళ్తే..
పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి, త్వరగా పూర్తయ్యేలా ఓ మంచి కథను సిద్ధం చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నెలకు సుమారు 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్‌కు కేటాయిస్తూ.. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసేలా కథ, దర్శకుడిని తీసుకుని రావాలని చెప్పినట్లు టాక్ వినిపించింది. అందుకు తగినట్లే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌ను దిల్ రాజు కలవటంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో సుజీత్ దర్శకత్వంలో రూపొందనున్న 'ఓజీ 2' ప్రాజెక్ట్ ఉంది. నాని హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న 'బ్లడీ రోమియో' పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దిల్ రాజు సినిమా లైన్‌లోకి వచ్చినట్లు టాక్. అయితే దీనిపై దిల్ రాజు రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసిన నిర్మాతగా అవకాశం ఉంటే సినిమా చేద్దామని ఆయన్ని కలిశాను. అయితే అన్ని పక్కాగా సెట్ అయినప్పుడే చెబుతానని దిల్ రాజు చెప్పేశారు. అంటే వీరి కాంబోలో వకీల్ సాబ్ తర్వాత మరో సినిమా వచ్చే అవకాశం ఉందని చెప్పకనే చెప్పేశారు.
మొత్తానికి దిల్ రాజు నిజంగానే పవన్ కళ్యాణ్‌తో కొత్త సినిమా ప్లాన్ చేస్తే.. కథ, దర్శకుడి ఎంపిక ఇప్పుడు కీలకంగా మారనుంది. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
