వెంకీతో అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నఅనిల్ రావిపూడి!
12/11/2026

టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి వీరి కాంబోలో సినిమా రావడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో తమకు కలిసొచ్చిన జనవరి 12 తేదీనే మరోసారి టార్గెట్ చేస్తుండటం ఇక్కడ అసలు విషయం. వివరాల్లోకెళ్తే..
వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలోనూ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్‌తో మెప్పించారు. ఈ సినిమా కూడా జనవరి 12నే విడుదలై ఘనవిజయం సాధించింది.
ఇప్పుడు మరోసారి అదే తేదీ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఆ సినిమానే ‘జనవరి12న విడుదల’. దాదాపు ఎనిమిదేళ్లలో వెంకటేష్‌తో ఆయన చేస్తున్న ఐదో సినిమా ఇది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే డేట్లో రిలీజైన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావటంతో ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అని సినీ సర్కిల్స్ భావిస్తున్నాయి. మరి వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మరోసారి సంక్రాంతి బరిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? తమకు కలిసొచ్చిన జనవరి 12 సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
