movies

దళపతి’ సీన్ రీక్రియేషన్.. అనిల్ రావిపూడి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ వైరల్!

19/11/2026

దళపతి’ సీన్ రీక్రియేషన్.. అనిల్ రావిపూడి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ వైరల్!

టాలీవుడ్‌లో సినిమాల ప్రమోషన్స్‌ను కొత్త పంథాలో తీసుకెళ్లే దర్శకుల్లో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు. తన సినిమాల్లోనే కాదు.. ప్రచార కార్యక్రమాల్లోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా స్టార్ట్ చేశారు.

సంక్రాంతి 2027 బరిలో నిలవనున్న ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన క్లాసిక్ మూవీ ‘దళపతి’లోని ఓ పాపులర్ సన్నివేశాన్ని అనిల్ రావిపూడి, హీరోయిన్ కృతి శెట్టి కలిసి సరదాగా రీక్రియేట్ చేశారు. అందులో అనిల్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి ఓ గర్ల్స్ సాంగ్ కోసం రీల్ చేయాలని అనుకోవడం, అందులోకి అనిల్ రావిపూడి ఎంట్రీ ఇవ్వడం వంటి సరదా అంశాలతో ఈ ప్రోమోను రూపొందించారు. ఈ వీడియోలో అనిల్ రావిపూడి కనిపించిన తీరు, ఆయన కామెడీ టైమింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్స్‌లోనూ దర్శకుడు తన మార్క్‌ను చూపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన పాటల ప్రచారాన్ని నవంబర్ 20 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్‌తో మ్యూజికల్ జర్నీ మొదలుకానుంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ముందుగా ప్రారంభిస్తున్న చిత్రంగా ‘జనవరి 12 విడుదల’ నిలవడం విశేషం. సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ ప్రేక్షకులను చేరుకునేందుకు చిత్ర బృందం ప్రత్యేకంగా అమెరికా పర్యటనకు ప్లాన్ చేసింది. డిసెంబర్ 26, 27 తేదీల్లో చికాగోలో, డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ టూర్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి పాల్గొననున్నారు.

వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలోని కుటుంబ కథా వినోద చిత్రంగా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email