movies

మరో భారీ టార్గెట్‌పై క‌న్నేసిన అనిల్ రావిపూడి.. ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేనా!

19/11/2026

మరో భారీ టార్గెట్‌పై క‌న్నేసిన అనిల్ రావిపూడి.. ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేనా!

టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన సినిమాల సక్సెస్ రేట్ చూస్తే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన నిలుస్తారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై విమర్శలు, ట్రోలింగ్ ఆగడం లేదు. సినిమా విడుదలకు ముందే కథ, కంటెంట్‌పై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తుంటారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనిల్ తన సత్తా చాటుతూనే ఉన్నారు.

ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి బాగా కలిసొస్తోంది. పండగను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేయడం, భారీ వసూళ్లు సాధించడం ఆయనకు అలవాటుగా మారింది. గతంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన మార్కెట్ ఏంటో నిరూపించాయి. ఇన్ని విజయాలు ఖాతాలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘జనవరి 12న విడుదల’పైనా ఇలాంటి చర్చే నడుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. భారీ క‌లెక్ష‌న్స్‌ను ఏ రేంజ్‌లో రాబ‌డుతుంద‌నే దానిపై లెక్క‌లు వేస్తున్న‌వారూ లేక‌పోలేదు. అయితే మరోవైపు అనిల్ రావిపూడి మాత్రం కమర్షియల్ సినిమాలను ఎలా తెరకెక్కించాలి? ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలి? అనే విషయాల్లో మంచి ప‌ట్టున్న డైరెక్ట‌ర్‌. సినిమా బడ్జెట్, షూటింగ్ సమయం, బాక్సాఫీస్ లెక్కల విషయంలో ఆయన చాలా పక్కా ప్లానింగ్‌తో సినిమాలు చేస్తూ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ సొంతం చేసుకుంటున్నారు.

అనిల్ సినిమాల విషయంలో సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వాటికి అలవాటు పడిపోయినట్లే కనిపిస్తోంది. తన పని తాను చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర ఫలితాలతో సమాధానం చెబుతున్నారు. ఈసారి కూడా సంక్రాంతి 2027ను టార్గెట్ చేసుకుని మరో రూ.300 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి విమర్శలు ఒకవైపు.. విజయాల పరంపర మరోవైపు అన్నట్లుగా అనిల్ రావిపూడి ప్రయాణం సాగుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో చేస్తున్న సినిమా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కూడా ఆయనకు మరో సంక్రాంతి హిట్‌ను అందిస్తుందా? సోషల్ మీడియా విమర్శలకు బాక్సాఫీస్ వసూళ్లతో సమాధానం చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email