movies

40 ఏళ్ల త‌ర్వాత ర‌జినీ, క‌మ‌ల్ ..లైన్‌లోకి హిట్ డైరెక్ట‌ర్‌

2/11/2026

40 ఏళ్ల త‌ర్వాత ర‌జినీ, క‌మ‌ల్ ..లైన్‌లోకి హిట్ డైరెక్ట‌ర్‌

సూపర్‌స్టార్ రజినీకాంత్, యూనివ‌ర్స‌ల్ హీరో కమల్‌హాసన్.. ఒక్కొక్క‌రిదీ ఒక్కో ప్ర‌స్థానం...ఒక్కో స్టైల్‌. నాలుగు ద‌శాబ్దాల ముందు అంటే కెరీర్ స్టార్టింగ్‌లో ఇద్ద‌రూ క‌లిసి కొన్ని సినిమాల్లో న‌టించారు. త‌ర్వాత స్టార్‌డ‌మ్ కార‌ణంగా క‌లిసి న‌టించ‌లేక‌పోయారు. అయితే ఫ్యాన్స్ మాత్రం వీరిద్ద‌రూ క‌లిసి మ‌రోసారి న‌టిస్తే చూడాల‌ని వెయిట్ చేస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే ఈ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ ప‌డ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రూపొందించ‌నున్న ఈ సినిమాకు నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నార‌ని టాక్‌.

ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ తన 173వ సినిమా ధర్మన్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. దీన్ని క‌మ‌ల్ హాస‌న్ నిర్మిస్తుండ‌టం విశేషం. జైల‌ర్‌2తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను సొంతం చేసుకున్న త‌లైవా..ఇప్పుడు త‌న ఫోక‌స్ అంతా ధ‌ర్మ‌న్‌పైనే పెట్టాడు. అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న పాత్రకు సంబంధించిన లుక్ అయితే రిలీజ్ అయ్యింది..కానీ, పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తి అయితే అంద‌రిలోనూ క్రియేట్ అయ్యింది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో సినిమా రిలీజ్ అవుతుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ చెబుతున్నాయి.

ధ‌ర్మ‌న్ త‌ర్వాత క‌మ‌ల్..ర‌జినీ కాంబో మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలుంటాయ‌నే సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నెల్స‌న్ ఈ స్టార్ హీరోస్‌ను ఎలా బ్యాలెన్స్ చేసి సినిమాను తెర‌కెక్కిస్తార‌నేది కూడా డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. అయితే జైల‌ర్‌, జైల‌ర్‌2 వంటి సెన్సేష‌న్స్ త‌ర్వాత నెల్స‌న్‌పై ర‌జినీకాంత్‌కు గురి కుదిరింది. ఇప్పుడు క‌మ‌ల్ కూడా యాడ్ కావ‌టంతో నెల్స‌న్‌కు వ‌ర్క్ మ‌రింత ఈజీగా మారింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జరుగుతుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌.

ఇప్పటికే ఆసక్తిని పెంచిన ప్రకటన

ఈ సినిమా గురించి దర్శకుడు, సంగీత దర్శకుడి వివరాలు వెల్లడైనప్పటి నుంచే సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది. అంతేకాదు, ఈ ఇద్దరు అగ్ర నటులను ఒకే సినిమాలో భాగం చేయడం తమకు ఎంతో గర్వకారణమని రెడ్ జెయింట్ మూవీస్ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల రజనీకాంత్ సైతం మీడియాతో మాట్లాడుతూ కమల్‌హాసన్ నిర్మాణంలో తామిద్దరం రెడ్ జెయింట్ మూవీస్ సినిమా కోసం కలిసి నటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, కథాంశం, నటీనటులు, విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇద్దరు దిగ్గజాలు మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email