movies

క్యాన్సర్‌ను జయించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్!

12/11/2026

క్యాన్సర్‌ను జయించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్!

టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ మోనాల్ గజ్జర్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తాను క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అయితే ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొని, విజయవంతంగా చికిత్స తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మలి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మోనాల్ గజ్జర్.. తనకు పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (థైరాయిడ్ క్యాన్సర్) ఉన్నట్లు తాజాగా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతోందని, క్రమంగా కోలుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా మోనాల్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. డబ్బు, పేరు, ఇతర విజయాల కంటే మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసే మనిషికి అసలైన సంపద అని పేర్కొన్నారు. తన అనారోగ్య అనుభవం ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేసిందని అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అందుబాటులో ఉన్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి కూడా అవగాహన కల్పించారు.

మోనాల్ గజ్జర్ చేసిన ఈ హెల్త్ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email