పుష్ప తరహా కథతో తమిళ సినిమా.. ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో ఓ.ఎం!
16/11/2026

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే బ్యాక్‌డ్రాప్‌తో మరో తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఓ.ఎం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, దాని వెనుక ఉన్న మాఫియా వ్యవస్థ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తోంది.
ఈ సినిమాలో ధనుష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. స్మగ్లింగ్ ముఠాలోకి వెళ్లి అక్కడి వ్యవహారాలను తెలుసుకునే అండర్‌కవర్ ఆపరేషన్‌లో ఆయన భాగం అవుతారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు సాయి పల్లవి కూడా పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. మమ్ముట్టి పాత్ర ఈ కథలో చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లింది.
అయితే పుష్పతో పోలికలు రావడం సహజమే. కానీ పుష్పలో స్మగ్లింగ్ చేసే వ్యక్తి ఎదుగుదల ప్రధానంగా చూపిస్తే, ఓఎంలో మాత్రం పోలీసుల ఆపరేషన్ చుట్టూ కథ నడవనున్నట్లు తెలుస్తోంది. దీంతో కథనంలో కొంత కొత్తదనం ఉండే అవకాశం ఉంది. అయితే ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో ఇప్పటికే పుష్ప రెండు భాగాలు రావడంతో, అదే కాన్సెప్ట్‌ను మరోసారి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుంది? పుష్పతో పోలికలు లేకుండా ఓఎం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందా? చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
