movies

రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం 'పోలీస్ కంపెనీ' – పవర్, ఇన్‌స్టిట్యూషన్ మధ్య సరికొత్త చర్చ!

21/10/2026

రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం 'పోలీస్ కంపెనీ' – పవర్, ఇన్‌స్టిట్యూషన్ మధ్య సరికొత్త చర్చ!

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో సంచలన ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా తన కొత్త సినిమా 'పోలీస్ కంపెనీ' (Police Company) పోస్టర్‌ను, సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ఆలోచనను పంచుకున్నారు.

పోలీస్ కంపెనీ అంటే ఏమిటి?
"పోలీసు అనేది ఒక వ్యవస్థ (Institution) మరియు కంపెనీ అనేది డబ్బు సంపాదించే సంస్థ. కానీ, దాని అధికారాలు ఒక హద్దు దాటినప్పుడు, ఒక వ్యవస్థ కాస్తా కంపెనీగా మారుతుంది.. అందుకే దీనికి 'పోలీస్ కంపెనీ' అని పేరు పెట్టాం" అంటూ ఆర్‌జీవి దీనికి సంబంధించిన నిర్వచనాన్ని ఇచ్చారు.

సినిమా ప్రత్యేకతలు:

ఈ చిత్రానికి "ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డి కంపెనీ" (It is more dangerous than D Company) అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడం విశేషం.

1997 మరియు 2004 మధ్య కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా, ఈ చిత్రంలో 319 మంది గ్యాంగ్‌స్టర్లను ఏ విధంగా మట్టుబెట్టారనే అంశంపై కథ నడుస్తుంది.

ఈ పోస్టర్‌లో హర్షవర్ధన్ రానే నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను 2027 జూన్ 4 న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అండర్ వరల్డ్ కథలతో అద్భుతాలు సృష్టించిన ఆర్‌జీవి, ఇప్పుడు పోలీసుల ప్రపంచాన్ని, వారి లోపలి కోణాలను ఏ విధంగా తెరపైకి తీసుకురాబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email