movies

12 ఏళ్ల గ్యాప్‌కు అసలు కారణం చెప్పిన నజ్రియా.. సూర్యతో రీఎంట్రీ స్పెషల్!

10/11/2026

12 ఏళ్ల గ్యాప్‌కు అసలు కారణం చెప్పిన నజ్రియా.. సూర్యతో రీఎంట్రీ స్పెషల్!

సౌత్ ఇండస్ట్రీలో తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. మలయాళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. తమిళ సినిమాలకు మాత్రం 12 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత సూర్య హీరోగా నటించిన సీన్ సినిమాతో కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ సుదీర్ఘ విరామం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

రాజా రాణి, నైయాండి, తిరుమణం ఎన్నుమ్ నిక్కాహ్ వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు నజ్రియా. అయితే 2014లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చారు. ఆ తర్వాత మలయాళంలో మళ్లీ నటన మొదలుపెట్టారు. తెలుగులో నాని సరసన అంటే సుందరానికీ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నారు.

అయితే పెళ్లి తర్వాత మలయాళంలో సినిమాలు చేస్తున్నప్పటికీ తమిళంలో మాత్రం కనిపించలేదు. దీంతో నజ్రియా కోలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారా అనే చర్చ కూడా జరిగింది. తాజాగా సీన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ 12 ఏళ్ల గ్యాప్‌పై ఆమె స్పందించారు. తమిళ సినిమాలకు దూరంగా ఉండటం అనేది తాను కావాలని తీసుకున్న నిర్ణయం కాదని నజ్రియా స్పష్టం చేశారు. కోలీవుడ్ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమకు తగినట్లుగా మంచి సినిమాతోనే తిరిగి రావాలని భావించానని చెప్పారు. రొటీన్ పాత్రలు కాకుండా తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చే బలమైన క్యారెక్టర్ కోసం ఎదురుచూశానని, అందుకే సరైన కథ దొరికే వరకు వేచి చూడాల్సి వచ్చిందని తెలిపారు.

దర్శకుడు జిత్తు మాధవన్ చెప్పిన సీన్ కథ, అందులో తన పాత్ర బాగా నచ్చడం. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి నటించే అవకాశం రావడం తన కమ్‌బ్యాక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చిందని చెప్పారు. ఇకపై తమిళంలోనూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి 12 ఏళ్ల పాటు తమిళ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సరైన కథ కోసం ఎదురుచూసిన నజ్రియా.. సీన్ సినిమాతో తన రీఎంట్రీని స్పెషల్‌గా మార్చుకున్నారు. ఇకపై కోలీవుడ్‌లో ఆమె ఎలాంటి సినిమాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email