బిఆర్ఎస్ – వైసీపీ లకు కాక్రోచ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయా.?
21/10/2026

అటువంటి వైసీపీ తాజగా బీజేపీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సీజేపీ కి మద్దతు ప్రకటించింది. అలాగే అటు బిఆర్ఎస్ సైతం సీజేపీ పోరాటానికి తమ పార్టీ తరుపున సంఘీభావం తెలిపింది. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పుడు సడన్ గా కాక్రోచ్ల వైపు చూడడానికి ఉన్న రాజకీయ కారణం ఏమిటి అనేది ఇక్కడ చర్చ.కాంగ్రెస్ తో విభేదించి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని స్థాపించారు, [color:green]ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని బిఆర్ఎస్ రాజకీయం మొదలుపెట్టింది.[/color]
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో రాజకీయ బంధం పెట్టుకుంటే అది పార్టీ క్యాడర్ లో అసంతృప్తికి దారి తీస్తుంది.అలాగని ఇటు బీజేపీ తో లోపాయకారి పొత్తుకు సై అందామనుకుంటే ఇరు పార్టీల ఉమ్మడి రాజకీయ శత్రువైన టీడీపీ బీజేపీ పార్టీకి ప్రధాన మిత్రపక్షంగా మారిపోయింది. టీడీపీ ని వద్దనుకుని బీజేపీ వైసీపీ వైపు చూసే ఆస్కారం లేదు, అలాగే టీడీపీ తో అలయన్స్ తో ఉన్న బీజేపీ తో బిఆర్ఎస్ జతకడితే ప్రత్యర్థి పార్టీల రాజకీయ దాడి పెరుగుతుంది.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ ఇప్పుడు నీట్ ఉద్యమంతో దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ మూడో ప్రత్యామ్నాయం గా కనిపిస్తుందా.? నీట్ ఉద్యమంతో జెన్ జీ లా మద్దతు సాధించిన సీజేపీ సర్ ఉద్యమంతో మరోసారి బీజేపీ పై రాజకీయంగా పై చేయి సాధిస్తే రేపటి రోజున దేశ రాజకీయాలలో సీజేపీ స్థాయి, స్థానం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.ఆ కారణమే వైసీపీ, బిఆర్ఎస్ లను కాక్రోచ్లకు దగ్గర చేస్తుందా.? అందుకే ఈ రెండు పార్టీల అధినేతలు ముందుగానే కర్చీఫ్ వేసుకుని తమ స్థానాన్ని రిజర్వ్ చేసుకుంటున్నాయా.? ఒకవేళ రేపటి రోజున వైసీపీ, బిఆర్ఎస్ ఊహలు వాస్తవంలోకి రాకుంటే, మరోమారు కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు బీజేపీ మొదలుపెట్టే రాజకీయ దాడిని వైసీపీ, బిఆర్ఎస్ లు తట్టుకుని నిలబడగలవా.?
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
