movies

2027 టార్గెట్‌..పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై కన్నేసి యంగ్ హీరోస్!

9/11/2026

ఒకప్పుడు టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటే స్టార్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపించేవి. ఒక్కో సినిమా కోసం రెండుమూడేళ్లు కేటాయిస్తూ..ప్రేక్షకులను కూడా భారీ అంచనాలతో వెయిట్ చేయించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలు కూడా భారీ ప్రాజెక్టుల బాట పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ కథలకు దూరంగా ఉంటూ, డిఫరెంట్ జానర్లు, భారీ విజువల్స్‌తో తమ మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 2027 బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తూ కొందరు కుర్ర హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో సిద్ధమవుతున్నారు.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సాయి దుర్గ తేజ్. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాను చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తేజ్ పూర్తిగా తన లుక్‌ను మార్చుకున్నారు. రగ్డ్ అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను 2027 ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కూడా పాన్ ఇండియా సినిమాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘స్వయంభు’, రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపైనా మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాలు 2027లో విడుదలకు సిద్ధమవుతుండటంతో నిఖిల్ మరోసారి నేషనల్ లెవెల్‌లో తన సత్తా చాటాలని చూస్తున్నారు.

మరోవైపు ‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైన తేజా సజ్జ కూడా 2027ను టార్గెట్ చేస్తున్నారు. సూపర్ హీరో, ఫాంటసీ జానర్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ‘జాంబిరెడ్డి 2’, ‘జై హనుమాన్’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జై హనుమాన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని తేజా సజ్జ భావిస్తున్నారు.

మొత్తానికి 2027 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరోల మధ్య ఆసక్తికరమైన పోటీ కనిపించేలా ఉంది. స్టార్ హీరోలకే పరిమితమైన భారీ బడ్జెట్, పాన్ ఇండియా మార్కెట్‌పై ఇప్పుడు కుర్ర హీరోలు కూడా గట్టిగా కన్నేశారు. కథ, కంటెంట్, విజువల్స్‌తో నేషనల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ భారీ ప్రయత్నాల్లో ఎవరు బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ విన్నర్‌గా నిలుస్తారో చూడాలి!

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email