movies

సూర్య 49వ సినిమాకు క్రేజీ టైటిల్‌.. ఎంజీఆర్ క్లాసిక్‌పై కన్ను!

10/11/2026

సూర్య 49వ సినిమాకు క్రేజీ టైటిల్‌.. ఎంజీఆర్ క్లాసిక్‌పై కన్ను!

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు స్టార్ హీరో సూర్య. కంగువా తర్వాత కరుప్పు, విశ్వనాథన్ అండ్ సన్స్, సీన్ సినిమాలతో వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో మరింత స్పీడ్ పెంచుతున్నారు. తాజాగా సూర్య 49వ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టైటిల్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన సీన్ సినిమాలో ఇన్బరాజ్ పాండియన్‌గా డార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు సూర్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుండగానే, తన 49వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. మండాడి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ మదిమారన్ పుగళేంది ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నారు.

సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల జీవితాలు, వాళ్ల కష్టాలు, పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ కోస్టల్ యాక్షన్ డ్రామాకు దివంగత లెజెండరీ నటుడు ఎంజీఆర్ నటించిన పడగోట్టి అనే క్లాసిక్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో సూర్య 49వ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి పెరిగిపోయింది.

మరోవైపు సూర్య, నిర్మాత కలైపులి ఎస్. థాను కాంబినేషన్‌లో వెట్రిమారన్ దర్శకత్వంలో రావాల్సిన వాడివాసల్ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమవుతూనే ఉంది. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని నిర్మాత కన్ఫార్మ్ చేసినా... ఎప్పుడన్న క్లారిటీ మాత్రం లేదు. అందుకే అంతకంటే ముందే పడగోట్టి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు ముందు సూర్య తన 48వ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మే 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email