మహేష్ హీరోయిన్ ఎక్స్పెరిమెంట్.. !
9/11/2026

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత భారతీయ సినిమాలో నటిస్తున్న ఆమె.. మరోవైపు నిర్మాతగానూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. పదేళ్ల క్రితం మరాఠీలో మంచి విజయాన్ని అందుకున్న ‘వెంటిలేటర్’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రియాంక మరోసారి నిర్మాణ రంగంలో యాక్టివ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
2016లో విడుదలైన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ ప్రియాంక చోప్రా నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్‌కు ఎంతో ప్రత్యేకమైనది. ఈ సినిమాను ఆమె తన తల్లి డాక్టర్ మధు చోప్రాతో కలిసి నిర్మించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మూడు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వెంటిలేటర్ 2’ తెరకెక్కనుంది. దర్శకుడు రాజేష్ మాపుస్కర్ మరోసారి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు.
‘వెంటిలేటర్ 2’ సినిమాను 2027లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల క్రితం అర్థవంతమైన కథలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో తమ నిర్మాణ సంస్థను ప్రారంభించామని, ‘వెంటిలేటర్’ తమకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా భారతీయ ప్రేక్షకుల ముందుకు తిరిగి రాబోతున్నారు. మరోవైపు ‘వెంటిలేటర్ 2’ నిర్మాణంతో తన ప్రొడక్షన్ హౌస్‌ను మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చారు. నిజానికి ప్రియాంక నిర్మాణ సంస్థ గతంలో ప్రాంతీయ భాషల్లో విభిన్నమైన కథలకు ప్రోత్సాహం అందించింది. ఇప్పుడు పదేళ్ల క్రితం తమకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాకే సీక్వెల్ చేయడం విశేషం.
మొత్తానికి ఒకవైపు రాజమౌళి ‘వారణాసి’తో నటిగా బిజీగా ఉంటూనే.. మరోవైపు ‘వెంటిలేటర్ 2’తో నిర్మాతగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు ప్రియాంక. మరి ఈ సీక్వెల్ మొదటి భాగం స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
