మహేష్, రాజమౌళి చిత్రం ‘వారణాసి’ స్టోరీ ఇదేనా!
9/11/2026

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథ, పాత్రలు, టైమ్ ట్రావెల్ అంశాల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెడ్డిట్‌లో ఓ ఆసక్తికరమైన స్టోరీ థియరీ వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ పాత్రతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలపై వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వైరల్ థియరీ ప్రకారం.. సినిమాలో రాముడు చేతిలో మరణించిన రావణుడి సోదరుడుకుంభకర్ణుడు కలియుగంలో కుంభుడిగా పుడతాడు. రావణుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన నవ రత్నాల హారాన్ని సొంతం చేసుకోవడమే కుంభుడి అసలు లక్ష్యంగా ఉంటాడు. రామ, రావణ యుద్ధం తర్వాత ఈ నవ రత్నాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెదిరిపోయాయని.. వాటన్నింటినీ తిరిగి ఒకచోట చేర్చేందుకు కుంభుడు ప్రయత్నిస్తాడు. ఇందుకోసం మహేష్ బాబు పాత్రను రంగంలోకి దించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తొమ్మిది రత్నాలను సేకరించే బాధ్యతను అప్పగిస్తాడని దాని కోసం అతనేం చేశాడనేడే సినిమా కథ అని న్యూస్ వినిపిస్తోంది. జైన రామాయణంలోని ఓ కథనం ప్రకారం.. రావణుడి ప్రతిబింబం ఆ హారంలోని తొమ్మిది రత్నాల్లో కనిపించేదట. దీంతో రావణుడికి పది తలలు ఉన్నట్లుగా కనిపించేవాడని అందుకే అతడిని దశాననుడు అని పిలిచేవారని ఈ థియరీలో ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు పాత్ర ప్రయాణం సాధారణంగా కాకుండా టైమ్ ట్రావెల్ రూపంలో సాగుతుందని, ఒక వార్మ్‌హోల్ ద్వారా నేరుగా రామాయణ కాలంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుందట. తొమ్మిది రత్నాలన్నీ ఒకచోట చేరితే కుంభుడికి అపారమైన శక్తి లభిస్తుందని మహేష్ బాబు పాత్ర తెలుసుకుంటుందట. ఆ శక్తి అతడిని అడ్డుకోలేని స్థాయికి తీసుకెళ్తుందని గ్రహించి.. కుంభుడి ప్రణాళికను భగ్నం చేయాలని నిర్ణయించుకుంటాడని ఈ కథనం సారాంశం. అందులో భాగంగా గతంలోకి వెళ్లి రామ, రావణ యుద్ధ సమయంలోనే కీలకమైన ఘటనను మార్చే ప్రయత్నం చేస్తాడని.. తద్వారా నవ రత్నాలు విడిపోకుండా వాటి భవిష్యత్తును మార్చేస్తాడని సమాచారం.
అయితే ప్రస్తుతం రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఈ కథనం కేవలం నెటిజన్ల ఊహాగానాలు, ఫ్యాన్ థియరీలు మాత్రమే. రామాయణం, టైమ్ ట్రావెల్, అడ్వెంచర్ కలగలిసిన అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను రాజమౌళి తనదైన శైలిలో ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి మరి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
