‘భోగి’.. వాయిదా వెనుక కారణమదేనా!
9/11/2026

టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘భోగి’. 1960ల కాలం నాటి తెలంగాణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం కథాంశంతో రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా పల్లెటూరి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం సెన్సార్ సమస్యలేనని తెలుస్తోంది. సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా రక్తపాతంతో, తీవ్ర హింసాత్మకంగా ఉండటంతో సెన్సార్ అధికారులు చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపించినట్లు సమాచారం. దీంతో సినిమాకు తుది క్లియరెన్స్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రివైజింగ్ కమిటీ సినిమా చూసి తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే సెన్సార్ ప్రక్రియ పూర్తికానుంది. అయితే ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఈ సినిమాలో శర్వానంద్ లుక్, పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని టీమ్ చెబుతోంది. 1960ల కాలం నాటి ఓ రస్టిక్ పల్లెటూరి వ్యక్తిగా శర్వానంద్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. బయటకు కఠినంగా కనిపించినా, తన అక్కాచెల్లెళ్ల కోసం ప్రాణం పెట్టే మంచి మనసున్న వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం శర్వానంద్ చేసిన మేకోవర్, నటనకు ఇప్పటికే మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
కేకే రాధామోహన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. మొత్తానికి హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లిన ‘భోగి’ విడుదలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సెన్సార్ క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది? కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు? అన్నది చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
