movies

బాలయ్య బాబుకు రెండక్షరాల సెంటిమెంట్.. హ్యాట్రిక్ కొడతారా?

9/11/2026

బాలయ్య బాబుకు రెండక్షరాల సెంటిమెంట్.. హ్యాట్రిక్ కొడతారా?

నందమూరి నటసింహం బాలకృష్ణకు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ చర్చకు వస్తోంది. అదే రెండక్షరాల సినిమా టైటిల్స్ సెంటిమెంట్. 1987లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘రాము’ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు, బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు 2026లో బాలయ్య మరోసారి రెండక్షరాల టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అదే ‘దాదా’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కలిసి చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో బాలయ్యను పూర్తి గ్యాంగ్‌స్టర్ లుక్‌లో చూపించారు. 1980ల నాటి ముంబై నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తమన్ అందిస్తున్న సంగీతం, మాస్ ఎలివేషన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక్కడే అభిమానులు ఓ ఆసక్తికరమైన లెక్కను తెరపైకి తీసుకొస్తున్నారు. 1987లో ‘రాము’, 2010లో ‘సింహా’.. ఇప్పుడు 2026లో ‘దాదా’. ఈ మూడు సినిమాల టైటిల్స్ రెండక్షరాలతో ఉండటం యాదృచ్ఛికమే అయినప్పటికీ, గతంలో ఈ టైటిల్స్‌తో విజయాలు అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘దాదా’తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా? అనే చర్చ మొదలైంది.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ 13న ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. మొత్తానికి బాలయ్య అభిమానుల లెక్క ప్రకారం ‘రాము’, ‘సింహా’ తర్వాత ఇప్పుడు ‘దాదా’ వంతు వచ్చింది. మరి రెండక్షరాల టైటిల్ సెంటిమెంట్‌కు తగ్గట్టుగా బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ అందుకుంటారా? ఈసారి కూడా హ్యాట్రిక్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email