ఫ్యాన్స్‌కి కమల్ బర్త్ ట్రీట్ అదిరింది.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా!
9/11/2026

విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరోసారి తనదైన స్టైల్లో సర్ప్రైజ్ చేశారు. వయసు పెరుగుతున్నా.. నటనలో ప్రయోగాలు చేయాలనే తపన మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు ‘సండియార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘సండియార్’ ఫస్ట్ లుక్‌లో కమల్ హాసన్ పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. పెరిగిన గడ్డం, బలమైన శరీరాకృతి, చేతిలో గన్.. ఆయన చూపుల్లో కనిపిస్తున్న ఇంటెన్సిటీ పోస్టర్‌కు హైలైట్‌గా నిలిచాయి. రివెంజ్ డ్రామా ఛాయలు కనిపించేలా రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా ‘రివెంజ్ కెన్ ఓన్లీ బీ సెటిల్డ్ ఇన్ బ్లడ్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పన్నయ్యరుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి విభిన్నమైన చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్‌తో కలిసి ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘సండియార్’ అనే టైటిల్‌కు కమల్ హాసన్‌తో గతంలోనూ అనుబంధం ఉంది. 2004లో ఆయన నటించిన ‘విరుమాండి’ సినిమాకు తొలుత ఇదే టైటిల్‌ను అనుకున్నారు. కొన్ని వివాదాల నేపథ్యంలో ఆ పేరును మార్చారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ‘విరుమాండి’కి సీక్వెల్ కాదు. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే ‘సండియార్’ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు కమల్ హాసన్. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించిన ఆయన.. ఈసారి రివెంజ్ యాక్షన్ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి!
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
