movies

న‌య‌న్‌కి ‘మ‌హాశ‌క్తి’ షాక్‌.. రూ.100 కోట్ల బడ్జెట్ పెడితే వ‌చ్చిందంతేనా!

9/11/2026

న‌య‌న్‌కి ‘మ‌హాశ‌క్తి’ షాక్‌.. రూ.100 కోట్ల బడ్జెట్ పెడితే వ‌చ్చిందంతేనా!

లేడీ సూపర్ స్టార్ నయనతారకు బాక్సాఫీస్ దగ్గర వరుస ఎదురుదెబ్బత‌గిలింది. ‘మూకుత్తి అమ్మన్ 2’గా రూపొందిన ‘మహాశక్తి’ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైనట్లు కనిపిస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే వసూళ్లు నిరాశాజనకంగా ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో ఈ మూవీ గురించి చర్చ మొదలైంది.

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహాశక్తి’లో నయనతార ప్రధాన పాత్ర పోషించారు. రెజీనా కసాండ్రా, ఉర్వశి, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ విజువల్స్, గ్రాఫిక్స్, ఫాంటసీ అంశాలతో రూపొందించిన ఈ సినిమాపై మేకర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కలు నిజమైతే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

నయనతారకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అయినప్పటికీ ‘మహాశక్తి’కి ఇక్కడ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్, కంటెంట్ విషయంలో ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడం కూడా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలోనూ ప్రేక్షకుల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నయనతారకు ఆ తర్వాతి సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ‘టాక్సిక్’, త‌మిళంలో వ‌చ్చిన‌ ‘హాయ్’ చిత్రాల తర్వాత ఇప్పుడు ‘మహాశక్తి’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, గ్రాండ్ విజువల్స్ ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టరని ‘మహాశక్తి’ మరోసారి నిరూపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లలో ఏమైనా పుంజుకుంటుందా? లేక నయనతార ఖాతాలో మరో నిరాశాజనక ఫలితంగా మిగిలిపోతుందా? అన్నది చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email