ఒకే రోజు సల్మాన్, శ్రద్ధా క్లాష్.. గతంలో ఇద్దరి మధ్య ఇంట్రస్టింగ్ కనెక్షన్!
10/11/2026

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు మాస్ సుల్తాన్ సల్మాన్ ఖాన్.. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రద్ధా కపూర్. ఈ ఇద్దరూ ఒకే రోజు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 4న జరగనున్న ఈ బిగ్ క్లాష్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ సినిమా, లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన శ్రద్ధా కపూర్ ఈఠా డిసెంబర్ 4న విడుదల కానున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు కూడా వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్నవే. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఎవరు పైచేయి సాధిస్తారనే చర్చ మొదలైంది.
అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నా.. గతంలో వీళ్ల మధ్య ఓ ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. చాలా ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ తన లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాలో శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్గా పరిచయం చేయాలని భావించారు. కానీ అప్పట్లో చదువుపై దృష్టి పెట్టిన శ్రద్ధా ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు అదే సల్మాన్ సినిమాకు పోటీగా తన చిత్రం విడుదల చేస్తుండటం విశేషం.
ఈ క్లాష్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈఠా సినిమా డిస్ట్రిబ్యూషన్ నుంచి ఓ ప్రముఖ స్టూడియో తప్పుకోగా, అదే సంస్థ ఇప్పుడు సల్మాన్ మాతృభూమి వెనుక నిలిచిందనే ప్రచారం జరిగింది. దీంతో రెండు సినిమాల మధ్య థియేటర్ల విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే అలాంటి సమస్యలేమీ ఉండవని, రెండు సినిమాలకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈఠా తెరకెక్కుతోంది. మరోవైపు యుద్ధం కంటే శాంతి గొప్పదనే భావోద్వేగ సందేశంతో మాతృభూమి రూపొందుతోంది. రెండు సినిమాల్లోనూ బలమైన ఎమోషన్స్ ఉండటంతో డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర హెల్దీ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒకప్పుడు సల్మాన్ ఆఫర్‌ను వదులుకున్న శ్రద్ధా.. ఇప్పుడు అదే స్టార్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
