
తులాభారం
మాస్ మహారాజా రవితేజ, విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RT78 అధికారికంగా ప్రారంభమైంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీని రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ‘టైటిల్ డాక్యుమెంటరీ’ కాన్సెప్ట్ వీడియో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మై హోమ్ రామ్ చేతుల మీదుగా విడుదలైన ఈ వీడియోలో వివేక్ ఆత్రేయ మార్క్ వినోదం, స్క్రీన్‌ప్లే చమత్కారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు: అనిల్ కరెళ్ల (జడేజా) రవి ఆంథోని (రాబిన్) అనస్వర రాజన్ (సౌండ్) తరుణ్ భాస్కర్ (దేవరాజ్) జేడీ చక్రవర్తి (శివాజీ రావు) ప్రియాంక మోహన్ (కృష్ణవేణి) దశాబ్దాలుగా రవితేజను ‘మాస్ మహారాజా’గా చూసిన ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ చిత్రంతో ఆయన ‘క్రైమ్ మహారాజా’గా, ‘నవ రవితేజం’ పేరిట సరికొత్త అవతారంలో మెప్పించబోతున్నారు. ఘనంగా పూజా కార్యక్రమాలు: చిత్ర యూనిట్ సమక్షంలో సినిమా లాంచ్ ఘనంగా జరిగింది. స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ మేకర్స్‌కు అందించారు. కెమెరా స్విచ్ఛాన్ డైరెక్టర్ చందు మొండేటి చేయగా, హీరో శ్రీవిష్ణు ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. తొలి షాట్‌కు దర్శకులు శివ నిర్వాణ, బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాంకేతిక వర్గం: సంగీతం: వివేక్ సాగర్ | సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్ ISC | ఎడిటింగ్: రవితేజ గిరిజాల | ఆర్ట్ డైరెక్టర్: జి.ఎం. శేఖర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
